చెన్నూరు : చెన్నూరు మండలం కడప– కర్నూలు జాతీయ రహదారి శేషయ్యగారిపల్లె వద్ద శుక్రవారం కారు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మైనార్టీ కాలనీ ఏటిగడ్డ వీధికి చెందిన జావేద్ హుసేన్(36) కడపలోని బండల ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించే వాడు. శుక్రవారం మధ్యాహ్నం కడప నుంచి చెన్నూరుకు బైక్‌పై బయలుదేరాడు.
కడప నుంచి మైదుకూరు మీదుగా వెళుతున్న కారు శేషయ్యగారిపల్లె వద్దకు రాగానే సడన్‌గా వేగం తగ్గించడంతో.. వెనుక వైపు నుంచి బైక్‌పై వస్తున్న జావిద్ హుస్సేన్ అదుపుతప్పి ఢీకొని కింద పడిపోయాడు. అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త మృతదేహంపై పడి భార్య గుండెలవిసేలా రోదించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment