బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు
రాయచోటి టౌన్: శ్రీ వీభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి ఫైర్ స్టేషన్ అధికారులు, ఫైర్ ఇంజిన్‌తో ఆలయ ప్రధాన గోపురాలను శుభ్రం చేశారు. ఆలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
18న రామాయణంపై సదస్సు
కడప కల్చరల్: తెలుగులో వచ్చిన రామాయణాలపై కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నామని యోగి వేమన విశ్వవిద్యాలయం, సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఆచార్య జి.పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం సహకారంతో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. తెలుగులో రామాయణాలు–సామాజిక దృక్పథం అనే అంశంపై ఈ సదస్సు ఉంటుందని తెలిపారు. వైవీయూ వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. బ్రౌన్ కేంద్రం డైరెక్టర్ ఆచార్య జి.పార్వతి సమన్వయకర్తగా, ప్రాచీన విశిష్ఠ అధ్యయన కేంద్రం డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో రామాయణంపై దాదాపు 100 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొంటారన్నారు. అలాగే పలువురు విదేశీ పరిశోధకులు పత్ర సమర్పణలు చేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment