
వైవీయూ వీసీగా ప్రకాష్‌బాబు నియామకం
కడప ఎడ్యుకేషన్: కడప యోగివేమన విశ్వ విద్యాలయ నూతన వైస్ చాన్సులర్‌గా ఫణితి ప్రకాష్‌బాబు నియమితులయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వు మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫణితి ప్రకాష్‌బాబు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్‌ఫర్మాటిక్స్, స్కూల్ ఆఫ్ లైప్ సైన్సెస్ లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కాగా ఆయన నేడో, రేపో బాధ్యతలను చేపట్టను న్నట్లు సమాచారం.
గండికోటను సందర్శించిన పర్యాటక శాఖ ఎండీ
జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను రాష్ట్ర పర్యాటకశాఖ ఏండీ అజయ్ జైన్ సందర్శించారు. మంగళవారం కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డిలతోకలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పెన్నాలోయ అందాలతోపాటు,మాధవరాయ స్వామి ఆలయం, జుమ్మామసీదు, రంగనాథస్వామి దేవాలయంతోపాటు ధాన్యాగారాన్ని సందర్శించారు. అనంతరం గండికోటలో జరుగుతున్న అభివృద్ధి పనులు, జరగాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆదితో చర్చించారు.
ప్రభుత్వాస్పత్రిలో
కాన్పుల సంఖ్య పెంచాలి
అట్లూరు: ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు కె.నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓసీ సేవలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లంకమల్లేశ్వర క్షేత్రంలో మెడికిల్ క్యాంపు నిర్వహించాలని సూచించారు. అనంతరం మాడపూరు పంచాయతీ పరిదిలోని చిన్నరాజుపల్లిలో జరుగుతున్న బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగు పరీక్షల సర్వేను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రమేష్, స్థానిక వైద్యాధికారి డాక్టరు హమీదాబేగం, సీహెచ్‌ఓ మురళీకృష్ణ, పీహెచ్‌ఎన్ లక్ష్మిదేవి, సూపర్‌వైజరు సుబ్రమణ్యం పాల్గొన్నారు.

వైవీయూ వీసీగా ప్రకాష్‌బాబు నియామకం

వైవీయూ వీసీగా ప్రకాష్‌బాబు నియామకం
Comments
Please login to add a commentAdd a comment