
పటిష్టంగా ఇరవై సూత్రాల అమలు
కడప సెవెన్‌రోడ్స్: ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని చైర్మన్ లంకా దినకర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసిన వివరాలు అందజేయాలన్నారు. అలా గే మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వారా కల్పించిన ఆస్తుల నాణ్యత, నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయంపై విచారణ చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద పూర్తయినట్లు చూపుతున్న పనుల్లో నాణ్యతపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 1922 గ్రామాల్లో 2.91 లక్షల గృహాలకుగాను 2.77 లక్షల గృహాలకు నీటి కొళాయిలు బిగించినట్లు లెక్కలు ఉన్నప్పటికీ కుళాయిల్లో నీరు రావడం లేదన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి జిల్లాలోని ఐదు దీర్ఘకాలిక నీటి వనరుల ద్వారా రక్షిత తాగునీరు ఇచ్చే లక్ష్యంతో సవరించిన డీపీఆర్‌తో జల్‌జీవన్ మిషన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామ న్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్లపై సబ్సిడీ ఇస్తోందన్నారు. జిల్లాలో 5600 టిడ్కో గృహాల్లో 3296 పూర్తయినట్లు, 80 శాతం మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నప్పటికీ ఆ గృహాల్లో నివాసం ఉంటున్న వారు సున్నా కావడం బాధాకరమన్నారు. కడప కార్పొరేషన్‌లో అమృత్ 1.0 కింద చేపట్టిన పనులు ఏడేళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. ఇప్పుడు అమృత్ 2.ఓ కింద 663 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మాట్లాడుతూ పంటలకు విపరీతమైన పురుగు మందులు వాడకం వల్ల ఆహారం విషపూరితం కాకుండా ఇరవై సూత్రాల్లో కొత్త విధానాలను తీసుకు రావాలన్నారు. అధ్వాన్నంగా తయారైన కాంక్రీట్ రోడ్లకు మరమ్మత్తులు చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పరిశ్రమలు, పర్యాటకం ప్రధాన భూమిక పోషించనున్నాయన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చైర్మన్ లంకా దినకర్
Comments
Please login to add a commentAdd a comment