అశ్వ వాహనంపై శ్రీరంగనాథుడు
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగ నాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 8వరోజు మంగళవారం రాత్రి శ్రీరంగనాథ స్వామి అశ్వవాహనంపై భక్తులను కరుణించారు. స్వామివారు వేట మార్గమున వెలుతున్న తీరును కళ్లకు కట్టినట్లుగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరంగనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల గుండా ఊరేగించారు. గ్రామోత్సవంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తిరుణాల ప్రాంగణంలో రాత్రి పులివెందుల శ్రీశివజ్యోతి నాటక కళానికేతన్ వారిచే నవరత్నాలు స్టేజీ నాటక ప్రదర్శన నిర్వహించారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజు బుధవారం శ్రీరంగనాథుడు సతీసమేతుడై హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment