
● పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి
కడప ఎడ్యుకేషన్/కడప కోటిరెడ్డి సర్కిల్: విద్యాశాఖ బలోపేతానికి పూర్వ ప్రాథమిక విద్య ప్రఽథమ ప్రాధాన్యత వహిస్తుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు అన్నారు. కడప నగరంలోని జయనగర్ నగర్ కాలనీలోగల జెడ్పీ బాలికల పాఠశాలలో ‘పోషణ్ భీ, పడాయి భీ’ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్న ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సమగ్ర శిక్ష, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ..అంగన్వాడీ రెండు అనుసంధానంగా పని చేయాలన్నారు. కడప మండల విద్యాశాఖ అధికారి దుద్దికుంట గంగిరెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే అభివృద్ధికి మైలురాళ్లు ఏర్పడాలని తెలిపారు. న్యూ క్లస్టర్ విధానంలో బేసిక్ ప్రైమరీ స్కూల్‌లకు అంగన్వాడీలను అనుసంధానం చేస్తూ పూర్వ ప్రాథమిక విద్య ..ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. జిల్లా జ్ఞానజ్యోతి డిస్ట్రిక్ కో– ఆర్డినేటర్ కిరణ్ రథం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2383 మంది అంగన్వాడీ వర్కర్స్‌కు శిక్షణ ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఐసీడీఎస్, విద్యాశాఖ సమగ్రంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పూర్వ ప్రాథమిక విద్య బలపడుతుందని పేర్కొ న్నారు. అనంతరం కి రిసోర్స్ పర్సన్ (ఏసిడిపిఓ)శోభారాణి, సూపర్వైజర్ ప్రశాంతి వర్కర్లకు పలు సూచనలు చేశారు. కడప నగరంలోని ఆరు సెక్టా ర్ల సూపర్‌వైజర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment