పోలీసులకు క్రమశిక్షణ ముఖ్యం
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగర శివార్లలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ శనివారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిరంతరం వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విధులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సీనియర్ పోలీస్ అధికారులు, ఆయా రంగాల్లో లబ్దప్రతిష్టులైన ఫ్యాకల్టీతో ఇస్తున్న ట్రైనింగ్ క్లాసెస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా, ఓపికగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం శిక్షణ కేంద్రంలోని కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపల్ కార్యాలయం, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్, బ్యారక్‌లను పరిశీలించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్‌రెడ్డిలకు సూచించారు. అనంతరం ఎస్పీ ఎర్ర చందనం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శివరాముడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment