అక్రమంగా వేప మొద్దులు తరలిస్తున్న లారీ సీజ్
అట్లూరు : అనుమతులు లేకుండా వేపచెట్లను నరికి తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ తెలిపారు. గురువారం అట్లూరు రెవెన్యూ పొలంలోని రెడ్డిపల్లి దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా వేప చెట్లను నరికి తరలించేందుకు లారీకి లోడు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. చెట్లను నరికి ఎక్కడకు తరలిస్తున్నారనే అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైలులో నుంచి పడి
యువకుడికి తీవ్ర గాయాలు
ముద్దనూరు : మండలంలోని చింతకుంట గ్రామ శివారులో గురువారం రైలులో నుంచి పడి ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్జున్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోయిన యువకుడిని చింతకుంటకు చెందిన ఇరువురు రైతులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు.
కార్యదర్శి అవినీతిపై విచారణ
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన గురుమోహన్ అవినీతిపై మాజీ వార్డు సభ్యుడు మార్తల వెంకటసుబ్బారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు గురువారం డీఎల్‌పీఓ తిమ్మక్క గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపవరం గ్రామ పంచాయతీలో లే అవుట్లలో అప్పటి కార్యదర్శి గురుమోహన్ అక్రమ వసూళ్లు చేశారని, లే అవుట్లకు అనుమతులు జారీ చేసే విషయంలో అవినీతికి పాల్పడ్డారని, 2019 నుంచి 2023 వరకు దొంగ సర్టిఫికెట్లతో గ్రామ పంచాయతీలో చెన్నకేశవ అనే ప్రైవేట్ వ్యక్తికి కార్యదర్శి, అప్పటి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం జీతాలు ఇచ్చినట్లు మార్తల వెంకటసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదు మేరకు గతంలో ఓ మారు విచారణ చేశామన్నారు. ప్రస్తుతం కలెక్టర్, డీపీఓ ఆదేశాల మేరకు మరో మారు పునర్విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వద్ద నుంచి అవినీతికి సంబంధించిన ఆధారాలను ఆమె సేకరించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామాంజనేయరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.
అక్రమంగా వేప మొద్దులు తరలిస్తున్న లారీ సీజ్
అక్రమంగా వేప మొద్దులు తరలిస్తున్న లారీ సీజ్
Comments
Please login to add a commentAdd a comment