
కనుల పండువగా కామాక్షి త్రేతేశ్వరుని కల్యాణం
రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన అత్తిరాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు గురువారం శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. దేవదాయశాఖ, ఉభయదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో కామాక్షిదేవి, త్రేతేశ్వరస్వామిని పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆసనంపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలతో ఆలయ ప్రధాన అర్చకులు కె. పద్మనాభశాస్త్రి ఆధ్వర్యంలో వేదపండితులు గణేష్, శశిధర్ స్వాములు వేద మంత్రాలు వల్లిస్తూ కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. కల్యాణం సమయంలో శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ కల్యాణ వేడుకలలో మహిళా భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment