పులివాహనంపై వీరభద్రుడి విహారం
రాయచోటి టౌన్: రాయచోటి వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్వామి వారు పులివాహనంపై ఊరేగారు. అర్చకులు ఉదయం స్వామి, అమ్మవారికి అభిషేకాలు జరిపారు.అనంతరం రంగు రంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా పులివాహనంపై కొలువుదీర్చారు. రాయచోటి పురవీధుల్లో ఊరేగించారు. మార్కెట్ వీధి, గాంధీబజార్, కంసలవీధి, బ్రాహ్మణ వీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. భక్తులు స్వామి, అమ్మవార్లకు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment