ప్రజాస్వామ్యం ఖూనీ
టీడీపీ కూటమి నియంతృత్వ పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తోంది.తాజాగా ప్రముఖ సినీనటుడు పోసాని
కృష్ణమురళిని హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్షసాధింపునకు నిదర్శనం. అక్రమ అరెస్టును పలువురు నాయకులు ఖండించారు.
–సాక్షి నెట్‌వర్క్
రాష్ట్రంలో ప్రజలకు వాక్
స్వాతంత్య్రం లేకుండా పోయింది
సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనకు పోసాని అరెస్ట్ అద్దం పడుతోంది.అనంతపురం నుంచి వచ్చామని అబద్ధాలు చెప్పి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అరెస్టు విషయంలో సైతం తప్పుదోవ పట్టించారు.ఆ పోలీసులు అన్నమయ్య జిల్లా సంబేపల్లికి చెందిన వారని, నోటీసులో పేర్కొన్న సెక్షన్లకు.. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.పోసాని క్రిష్ణ మురళి టీవీ డిబేట్లలో న్యాయపరంగా, చట్టపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తారు.అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరం.విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ప్రజలకు ఉన్న వాక్ స్వాతంత్య్రాన్ని కూడా హరిస్తూ మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు.
– ఎస్‌బీ అంజద్‌బాషా,
మాజీ డిప్యూటీ సీఎం
కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట
పోసాని కృష్ణమురళి అరెస్టు కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇటువంటి అక్రమ ఆరెస్టులు చేయటం దారుణమైన చర్య. చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావు.
–ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే
పోసాని అరెస్ట్ అప్రజాస్వామికం
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కక్షసాధింపు చర్యలకు దిగుతూనే ఉంది.కూటమిప్రభుత్వం 9 నెలల పాలనలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతోంది. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. – నిసార్ అహ్మద్,
మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త
ప్రజాస్వామ్యం ఖూనీ
ప్రజాస్వామ్యం ఖూనీ
ప్రజాస్వామ్యం ఖూనీ
Comments
Please login to add a commentAdd a comment