మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.దీంతో మహా సంప్రోక్షణకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని తిరుమల–తిరుపతి దేవస్థానం సివిల్ విభాగం చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ గురువారం సంబంధిత అధికారులు, గుత్తేదారులకు సూచించారు. మహా సంప్రోక్షణకు విచ్చేసే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఎండ నుంచి ఉపశమనం కల్గించేందుకు చలువపందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనంతరం శాశ్వత కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. సివిల్ విభాగం ఎస్‌ఈ మనోహర్, ఈఈ సుమతి, డీఈ నాగరాజు, ఏఈ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment