నాటుసారా రహిత జిల్లా లక్ష్యంగా ‘నవోదయం’
కడప సెవెన్‌రోడ్స్: నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే.. నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని, ఆ దిశగా జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా ప్రొహిబిషన్– ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం ‘నవోదయం 2.0‘పై ఎస్పీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లా చుట్టూ చాలా జిల్లాల సరిహద్దు ప్రాంతాలను కలిగి ఉండడంతో... ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మరింత సూక్ష్మ దృష్టి సారించాలన్నారు. నవోదయం 2.0పై డివిజన్, గ్రామస్థాయి సమావేశాలను వచ్చే నెల రోజుల్లోపు నిర్వహించాలన్నారు. గ్రామాలు, పట్టణా ల లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాటుసారా వినియోగం వల్ల కలిగే.. ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలను వివరించాలని, నాటుసారా తాగడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం అమలుపై అన్ని అనుబంధ శాఖలు ప్రత్యేక దష్టి సారించాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి సరఫరా వంటి సమాచారం తెలిస్తే.. టోల్ ఫ్రీ నెం : 14405 కాల్ చేసి తెలియజేసి జిల్లాను నాటుసారా రహితంగా మార్చడంలో తమ వంతు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, జడ్పి సిఈఓ ఓబులమ్మ, ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్. రవికుమార్, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో తాగునీటి కొరత రాకూడదు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ప్రణాళిక బద్ధ చర్యలు చేపట్టాలని, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా నీటి వనరులను గుర్తించి శాశ్వత నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాల్‌లో తాగునీటిపై ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారుల తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగానే ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటి సరఫరా సమయ వేళలను నిర్దేశించి నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఆయా పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు చేసి సాంకేతిక పరమైన ప్రణాళికతో పనులు చేపట్టాలని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ ఏడుకొండలు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Comments
Please login to add a commentAdd a comment