
బ్యాటరీల చోరీ కేసులో నాలుగు నెలలు జైలు
రాయచోటి టౌన్ : సెల్ టవర్ వద్ద మూడు బ్యాటరీలు చోరీ చేసిన కేసులో ముద్దాయికి నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించినట్లు అర్బన్ ఎస్‌ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామ సమీపంలో ఎయిర్‌టెల్ టవర్ వద్ద టవర్ కోసం ఏర్పాటు చేసిన రూ.24 వేలు విలువ గల మూడు బ్యాటరీలు చోరీకి గురయ్యాయన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీకి చెందిన పెదివీటి దావీదుగా గుర్తించి కేసు నమోదు చేశారన్నారు. దీనిపై విచారణ చేసిన రాయచోటి ఇన్‌చార్జి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పీజే తేజ సాయి ముద్దాయికి ఈ మేరకు శిక్ష విధించారని తెలిపారు. ఈ కేసు విచారణలో పోలీసులు రమేష్, నాగ శంకర్‌లు విశేషమైన కృషి చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment