
45 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం క్రాస్ వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. 45 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
గంజాయి స్వాధీనం
బద్వేలు అర్బన్ : అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ బి.సీతారామిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సిద్దవటం రోడ్డులోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి, వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలోని పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీ నిర్వహించామన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచిఒక ద్విచక్ర వాహనాన్ని, 850 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని విచారించగా వారు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణారెడ్డి, రంగస్వామి, నారాయణరెడ్డి, బాలయేసు, కానిస్టేబుళ్లు విష్ణువర్దన్‌రెడ్డి, కొండలరావు, హుస్సేన్‌వలి, గురయ్య తదితరులు పాల్గొన్నారు.
బంగారు, నగదు చోరీ
వల్లూరు : వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె క్రాస్ వద్ద కడప– తాడిపత్రి ప్రధాన రహదారిలో ఉన్న మామిళ్ల గురివిరెడ్డి ఇంటిలో బుధవారం రాత్రి బంగారు, నగదు చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మామిళ్ల గురివి రెడ్డి తన ఇంటిలోని డబుల్ కాట్‌కు ఉన్న లాకర్‌లో బంగారు, నగదు ఉంచి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి అలాడుపల్లెలోని ఆలయంలో జాగరణ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటిలో ఎవరూ లేనట్లు గమనించిన దుండగులు ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళాన్ని తొలగించి లోనికి ప్రవేశించారు. బెడ్ రూంలోకి వెళ్లి డబుల్ కాట్ లాకర్‌లో ఉన్న 80 గ్రాముల బంగారు, రూ. 40 వేల నగదును చోరీ చేశారు. గురువారం ఉదయం ఇంటికి చేరుకున్న గురివిరెడ్డి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ ఎస్‌కే రోషన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలంతో ఇంటిలో తనిఖీ చేశారు. వేలి ముద్రల నిపుణులు వేలి ముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.

45 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం

45 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment