కూటమికి ప్రజలు త్వరలోనే బుద్ధిచెప్తారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి
తాము అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే ప్రజలకు హామీలు ఇస్తున్నామని చెప్పిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలయినా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీకి దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. గతంలో చంద్రబాబు మిగిల్చిపోయిన అరియర్స్‌ను జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్య కోసం రూ. 38 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలే బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment