420 కేసు నమోదు చేయాలి
● వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు
హామీలను విస్మరించిన రాష్ట్రంలోని కూటమి నేతలపై 420 కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను చంద్రబాబు అటకెక్కించారని దుయ్యబట్టారు. పీఎం కిసాన్‌తోపాటు రైతులకు రూ. 20 వేలు ఇస్తామని నమ్మబలికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తాము తక్కు వ కాలంలోనే రోడ్లపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నా రు. వేలాదిగా ప్రజలు యువత పోరులో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చినా కలెక్టర్, జేసీ అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment