లింగాల సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం
లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్ స్టేషన్‌లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్ స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్ స్టేషన్ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్‌ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది అనిల్ కుమార్, రవీంద్రారెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్ స్టేషన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు.