
శ్రీ సోమేశ్వరుడి సేవలో జిల్లా జడ్జి
కడప కల్చరల్ : కడప నగరం దేవుని కడపలోని శ్రీ సోమేశ్వరస్వామిని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, రామారావు దంపతులు దర్శించుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఏఓ శ్రీధర్ వారికి స్వాగతం పలికారు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
కడప అర్బన్ : కడప నగరం అక్కాయపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మిదేవి(32) అనే మహిళ కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బండపల్లి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీదేవి (32), తన భర్త రాముడుతో కలిసి ఏడాదిన్నర క్రితం జీవనోపాధి కోసం కడపకు వచ్చారు. . ఏడాది నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతుండేది. శనివారం రాత్రి కడుపునొప్పి రావడంతో భర్త మాత్రలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. అంతలోనే ఆమె విషద్రావణం తాగింది. భర్త గమనించి రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.