సాక్షి రాయచోటి: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్‌సీపీ సర్కార్ వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించేలా ప్రణాళిక అమలు చేసింది.ఎక్కడికక్కడ పశువులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు 2022 మే 19వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది.సమున్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచార వాహనాలతో ఉత్తమ వైద్యానికి చర్యలు చేపట్టారు. అప్పట్లోనే ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా పశువులకు సేవలు అందిస్తూ వచ్చిన సంచార వైద్యానికి గ్రహణం పట్టుకుంది. ప్రస్తుత కూటమి సర్కార్ సంచార పశు వైద్య వాహనాల గురించి పట్టించుకోకపోవడంతో దాదాపు మూడు వారాలుగా ఇవి మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు వాటిని నిలిపివేశారు.
కాంట్రాక్టు గడువు ముగిసినా..
ఉన్నతాశయంతో వైఎస్ జగన్ సర్కార్ పశు సంచార వాహనాలకు శ్రీకారం చుడితే గడువుముగియడంతో పక్కన పెట్టేశారు. అయితే కూటమి సర్కార్ కాంట్రాక్టు ముగిసినా పట్టించుకోకుండా ముందుకు వెళు తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంత పశువులకు, ఇతర జంతువులకు ఉపయోగపడే ఈ పథకంపై ప్రస్తుత సర్కార్ నిర్లక్ష్యం చూపడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఏది ఏమైనా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంచార పశు వైద్య వాహనాల కాంట్రాక్టు పొడిగించడంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అంతుచిక్కడం లేదని పలువురు పశువుల యజమానులు ప్రశ్నిస్తున్నారు.
అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. అయితే సంచార పశు వైద్య వాహనం ద్వారా ఎక్కడికక్కడ సమస్య ఉన్నచోటనే...జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. పశువుల సంరక్షణ కోసం 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా సంచార వాహనంలో అందుబాటులో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే దీనికి 108, 104 తరహాలోనే ఒక నంబరును కేటాయించి ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో 6, వైఎస్సార్ జిల్లాలో 7 వాహనాలు తిరగడకపోవడంతో రెండోదశలో వచ్చిన వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. దీంతో పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ఎందుకంటే కొన్ని వాహనాలు పక్కన పెట్టడంతో మిగిలినవి పరిమిత సంఖ్యలోనే వైద్యం అందిస్తాయి. దీంతో పాడి రైతులకు సమస్యలు తప్పడం లేదు.
అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని పశువుల సమాచారం
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
అన్నమయ్య జిల్లాలో పశుసంవర్దకశాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు మీరడంతో పక్కన పెట్టారు. అయితే రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు యజమానులకు ఇబ్బందులు లేకుండా చూస్తు న్నాం. ఎప్పటికప్పుడు పాడి రైతులతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. –గుణశేఖర్‌పిళ్లై, పశు సంవర్ధకశాఖాధికారి, అన్నమయ్య జిల్లా
వాహనాలను పనురుద్ధరించాలి
గత ప్రభుత్వ హయాంలో సంచార వైద్యశాలలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటివద్దనే వైద్యం అందేది. నేడు ఆ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యంగా దెబ్బతింటే ఆటోల ద్వారా సమీప పశువైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇలా చేయడం కష్టంతో కూడుకున్న పని, ఆర్థికంగా ఇబ్బంది. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పనురుద్ధరించాలి. –సుబ్బరాయుడు,రైతు పాళెంగడ్డ,సంబేపల్లె మండలం
వైఎస్సార్ జిల్లా అన్నమయ్య జిల్లా
గేదెలు 3,99,854 100588
కోళ్లు 31,82,190 30,82,260
ఎద్దులు, ఆవులు 44,000 276417
గొర్రెలు 9,20,614 18,24,325
మేకలు 3,80,099 3,53,370
జిల్లాలో పాడి రైతులు 1.80 లక్షలు 2 లక్షలు
మొదటి విడతలో వచ్చిన సంచార పశు వైద్య వాహనాలు నిలుపుదల
మూగజీవాలకు కష్టకాలం
● పశు యజమానులకు కష్టకాలం
● పశు యజమానులకు కష్టకాలం
● పశు యజమానులకు కష్టకాలం