
చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు
పులివెందుల రూరల్ : చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి ఎం.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పులివెందుల ప్రభుత్వ గిరిజన సమీకృత బాలికల వసతి గృహంలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చిన్నపిల్లలపై రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను నిరోధించేందుకు సుప్రీంకోర్టు 2012 నవంబర్ 12వ తేదీన పోక్సో చట్టం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కిశోర్ కుమార్ రెడ్డి. పాలగిరి ప్రకాష్, వార్డెన్ కళావతి, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.