
నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్‌సీ, ఐఆర్, డీఏ బకాయిల విడుదల, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ బిల్లుల రీఎంబర్స్‌మెంట్, కారుణ్య నియామకాలు తదితర సమస్యల సాధన కోసం ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 2వ తేదీ బుధవారం కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కడపలోని ఎస్టీయూ కార్యాలయంలో నిరసన కార్యక్రమానికి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యుడు సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ ఆర్.అబ్దుల్లా, నాయకులు ఖాదర్ బాషా, రాజశేఖర్, నరసింహారావు, సాజిద్, బాలగంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌పై టీడీపీ వర్గీయుల దాడి
చెన్నూరు(వల్లూరు) : మండల కేంద్రమైన చెన్నూరులో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మిట్టా మాధవరెడ్డిపై దాడి చేశారు. టీడీపీ నేతలు, మద్దతుదారులు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తూ, వారి అక్రమ ధనార్జనకు అడ్డుగా మారాడనే అక్కసుతో ఆ పార్గీకి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివరాలిలా.. చెన్నూరుకు చెందిన మిట్టా మాధవరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మండలంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తున్నాడు. అక్రమార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీడీపీ వర్గీయులకు ఇది కంటగింపుగా మారింది. తమ ఆదాయాలకు గండి కొడుతున్నాడనే కారణంగా అతనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నూరులోకి కొత్త రోడ్డులో గల ఒక హోటల్‌లో ఉన్న మాధవ రెడ్డిపై టీడీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవరెడ్డిని పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవరెడ్డిని పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన