జూన్‌లో గండి ఆలయ కుంభాభిషేకం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి జూన్‌లో కుంభాభిషేకం చేయాలని, భక్తులకు మూల విరాట్ దర్శనం కల్పించాలని దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన గండి దేవస్థానానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నాలుగేళ్లు కావస్తున్నా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని, పత్రికల్లో వార్తలు, భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ప్రారంభం నుంచి భక్తులకు అలవాటయ్యేలా పద్ధతి మార్చాలని, మూల విరాట్ వద్ద దర్శనం తీర్థం, సెటారి ఉండాలని సూచించారు. స్వామిని ప్యాకెట్ పాలతో కాకుండా, గోశాలలోని ఆవుపాలతో అభిషేకించాలన్నారు. భక్తులచే ఉత్సవ విగ్రహం వద్ద చేయించాలని అర్చకులకు సూచించారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు ఆయచే పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దేవాదాయ శాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ఆజాద్
Comments
Please login to add a commentAdd a comment