పులివెందుల టౌన్ : పట్టణంలోని చవ్వా సుభాకర్‌రెడ్డి కాలనీలోని వైఎస్.సుశీలమ్మ నేత్రాలను దానం చేసి ఆమె కుటుంబీకులు దాతృత్వం చాటుకున్నారు. బుధవారం సుశీలమ్మ మృతి చెందడంతో ఆమె నేత్రాలు దానం చేసేందుకు భర్త వైఎస్.ఆనంద్ రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్‌రెడ్డి, కుమార్తెలు వైఎస్.సునీత, సాధన అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ సభ్యుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ హరీష్‌తో కలిసి రాజు మృతురాలి ఇంటికి వెళ్లి వైఎస్.సుశీలమ్మ కార్నియాలు సేకరించి హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్ర నిధికి పంపారు. రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసి పోయే నేత్రాలు దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు, బంధువులు మరణించిన సమయంలో దుఃఖంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు సమయ స్ఫూర్తితో నేత్రదానానికి అంగీకరించి 9866727534, 7093204537 అనే ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
వైఎస్.సుశీలమ్మకు ఎంపీ నివాళి
పులివెందుల రూరల్ : పట్టణంలోని చవ్వాసుభాకర్‌రెడ్డి కాలనీలో నివాసముంటున్న వైఎస్.ఆనంద్‌రెడ్డి సతీమణి వైఎస్.సుశీలమ్మ బుధవారం మృతి చెందారు. కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి మృతురాలి ఇంటికి వెళ్లి సుశీలమ్మ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుశీలమ్మ భర్త వైఎస్.ఆనంద్‌రెడ్డి, కుమారుడు వైఎస్.రాజేష్‌రెడ్డి, కుమార్తెలు సునీత, సాధనలను ఎంపీ పరామర్శించారు. అనంతరం పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ సమాధుల తోటలో జరిగిన వైఎస్.సుశీలమ్మ అంత్యక్రియలు జరిగాయి. వైఎస్.ప్రకాష్‌రెడ్డి, వైఎస్.ప్రతాప్‌రెడ్డి, వైఎస్.జోసెఫ్‌రెడ్డి, వైఎస్.మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్.ప్రమీలమ్మ, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్ కుటుంబసభ్యులు జగదీశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బంధువులు పాల్గొన్నారు.
నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపు
వైఎస్.సుశీలమ్మ కుటుంబీకుల దాతృత్వం