ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ప్రజా రవాణాఽధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో గోపాల్‌రెడ్డి డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ● గాలివీడుకు చెందిన వెంకట రమణ కదిరి నుంచి తిరుపతికి వయా ఎన్‌పీ కుంట, గాలివీడు, రాయచోటి మీదుగా బస్సును నడపాలని కోరారు. ● మాధవరానికి చెందిన మునెయ్య కొత్త మాధవరం, మాధవరం–1లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ● అగుడూరుకు చెందిన రమణ, రాజాలు ప్రొద్దుటూరు–సంతకొవ్వూరు మధ్య తిరుగుతున్న సర్వీసును అగడూరు వరకు పొడిగించాలన్నారు. ● బుక్కాయపల్లె రామమునిరెడ్డి దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామానికి ప్రొద్దుటూరు లేదా మైదుకూరు డిపో నుంచి బస్సు నడపాలన్నారు. ● జమ్మలమడుగుకు చెందిన సాయిచంద్రారెడ్డి ప్రొద్దుటూరు–జమ్మలమడుగు నాన్‌స్టాప్ బస్సులకు బుకింగ్ కండక్టర్లు త్వరితగతిన టిక్కెట్లు జారీ చేసేలా చూడాలని కోరారు. ఆయా సమస్యలను ఆర్‌ఎం సంబంధిత డిపో మేనేజర్లకు బదిలీ చేసి వాటి పరిష్కరించాలని చొరవ చూపాలని సూచించారు.
ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత