కలకడ : వేసవిలో వృద్ధులు, చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈసమయంలో మంచినీరును అధికంగా తీసుకుని, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చని కలకడ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున సూచిస్తున్నారు. ప్రతి వ్యక్తి రోజుకు నాలుగు లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. ప్రతి 2గంటలకు అరలీటరు నీటిని విధిగా తాగాలి. భోజనం తినే సమయంలో తక్కువగా..అరగంట ఆగిన తర్వాత ఎక్కువ నీరు తాగాలని తెలియజేస్తున్నారు.