
21న ప్రభుత్వ పురుషుల కళాశాలలో జాబ్ ఫెస్ట్
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ పురుషుల కళాశాల, కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు సంయుక్తంగా ఈ నెల 21న ఏపీ ఎస్ ఎస్‌డీసీ సౌజన్యంతో కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో (స్వయంప్రతిపత్తి) జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జెకేసీ) ఆధ్వర్యంలో జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.రవీంద్రనాథ్ తెలిపారు. కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ జాబ్ ఫెస్టులో సుమారు 21 కంపెనీలు పాల్గొంటారని వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ జాబ్ డ్రైవ్లో పాల్గొనదలచిన అభ్యర్థులు బయోడేటా/రెస్యుమ్/ఆధార్‌తోపాటు సర్టిఫికేట్ల జిరాక్సు ప్రతులతో హాజరు కావాలని కోరా రు. మరిన్ని వివరాలకు కళాశాలలోని జేకేసీ మెంటార్లు డాక్టర్ ఎన్.సారథి (9347256400) లేదా సీవీ. రవీంద్రారెడ్డి (9390052901)లను సంప్రదించాలని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
కడప నెవెన్ రోడ్స్: మండల స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అన్నారు. బుధవారం జెడ్పీలో జిల్లాలోని ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో మండలాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మెన్ పిట్టు బాలయ్య, జెడ్పీ సీఈవో ఓబుళమ్మ, జిల్లా పరిషత్ ఏవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు జడ్పీ చైర్మెన్‌ను ఘనంగా సత్కరించారు.
డాక్టర్ సుధాకర్‌రెడ్డికి
అరుదైన గౌరవం
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల భౌతికశాస్త్ర ఆచార్యులు, శాస్త్రవేత్త ఆచార్య బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డికి మరోసారి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 50వేల మంది సభ్యులుగా ఉండే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా అవకాశం దక్కించుకున్న ఈయన తాజాగా సొసైటీ వారు మెటీరియల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో చేసిన ప్రతిభను గుర్తించి ఎఫ్‌ఆర్‌ఎస్‌సీ (ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ) అందించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను, అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘రాయల్ సొసైటీ బ్యాడ్జి’ను బుసిరెడ్డికి పంపారు. బుధవారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ప్రిన్సిపాల్ డా. జి. రవీంద్రనాథ్ ఎంతో గౌరవంగా భావించే బ్యాడ్జిని డా. బుసిరెడ్డికి తగిలించడంతో పాటు సర్టిఫికెట్‌ను అందించి అభినందించా రు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో
ప్రకృతి వ్యవసాయం
సిద్దవటం: ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ సురేష్‌బాబు తెలిపారు. సిద్దవటంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని టక్కో లు, మాచుపల్లె గ్రామాల్లోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారం అంతా విషపూరితమే అని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై మహిళా సమాఖ్యలతో భాగస్వామ్యం , ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రైతు సాధికార సంస్థ.. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య సంఘాలతో సంప్రదించి ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్.వి. ప్రవీణ్, అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

21న ప్రభుత్వ పురుషుల కళాశాలలో జాబ్ ఫెస్ట్

21న ప్రభుత్వ పురుషుల కళాశాలలో జాబ్ ఫెస్ట్