ముగ్గురిని పొడిచి యువకుడు పరార్
కమలాపురం : స్థానిక అక్సా నగర్‌లో ఆదివారం రాత్రి ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కత్తి పోట్లకు గురయ్యారు. స్థానికులు, బాధితుల సమాచారం మేరకు..అక్సా నగర్‌లో గతంలో నివాసమున్న సల్మాన్ ఇటీవల ఇందిరమ్మ కాలనీలో చేరారు. పది రోజుల కిందట అక్సానగర్‌కు వచ్చి బైక్‌ను ఎక్కువ స్పీడ్‌తో రైడ్ చేస్తున్నారు. అదే కాలనీకి చెందిన సొహెయిల్, షాబాజ్ స్పీడ్‌తో వెళ్లవద్దంటూ మందలించారు.
అది మనసులో పెట్టుకున్న సల్మాన్ ఆదివారం రాత్రి అక్సానగర్‌కు వచ్చి సోహెల్, షాబాజ్‌లను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రియాజ్‌పైనా దాడికి దిగాడు. స్థానికులు గుర్తించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సొహెయిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. షాబాజ్, రియాజ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఆసుపత్రికి వచ్చి జరిగిన దాడి గురించి ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన సల్మాన్ పరారీలో ఉన్నాడు.