
● బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గుణ భూషణరెడ్డి, జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ, డీపీఓ రాజ్యలక్ష్మీ, కడప జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం గోపాల్ రెడ్డి, ఒంటిమిట్ట ఎంఆర్‌ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.