
విద్యార్థి అదృశ్యం
జమ్మలమడుగు : మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన మంగపట్నం పవన్ అదృశ్యమైట్లు మైలవరం ఎస్‌ఐ శ్యాంసుందర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగపట్నం పవన్ జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతున్నాడు. అయితే ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కాలేజీ ఫీజు కట్టేందుకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లిపోయాడు. ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో విద్యార్థి తండ్రి లింగమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గత నెల 27న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యకిత రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రిమ్స్ పోలీసుల కథనం మేరకు.. వీరపునాయునిపల్లి మండలం పాలగిరి గ్రామానికి చెందిన మల్లెం కొండ జగదీష్ (42) కడప జెడ్పీ ప్రాంగణంలోని అన్న క్యాంటీన్‌లో పని చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై గత నెల 27న రిమ్స్ ఆసుపత్రి సమీపంలో పురుగుల మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని
వ్యక్తి మృతి
కలసపాడు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని ఎగువ రామాపురం గ్రామానికి చెందిన షేక్‌ఖాదర్‌వలీ (62) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కార్పెంటర్ పని చేసుకుని జీవిస్తున్న ఖాదర్‌వలీ తన సొంత పని నిమిత్తం గిద్దలూరుకు వెళ్లి పని ముగించుకుని బైక్‌లో వస్తుండగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు పెట్రోలు బంకు వద్ద గిద్దలూరుకు వెళుతున్న యువకుల బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య బషిరున్, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

విద్యార్థి అదృశ్యం