లారీని ఢీకొట్టిన బస్సు,10మందికి గాయాలు | 10 injured in nalgonda road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన బస్సు,10మందికి గాయాలు

Published Sat, Jun 23 2018 10:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 32 మంది ప్రయాణికుల్లో పదిమందికి గాయాలయ్యాయి. హైవేపైనే లారీలు నిలపడం వల్ల ఈ ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికితోడూ బస్సు వైపర్‌ పని చేయకపోవడంతో బస్సు డ్రైవర్ కి రోడ్డు కనిపించక లారీని ఢీకొట్టాడని ప్రయాణికులు చెబుతున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement