దేశంలో గత నాలుగేళ్ల నుంచీ ప్రతీ రోజూ 550 చొప్పున ఉద్యోగాలు కనుమరుగవుతున్న విషయం తెలుసా...? ఇదే విధమైన ధోరణి కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు అంతరించిపోయే ప్రమాదం ఉందట. దేశంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి ఢిల్లీకి చెందిన సివిల్ సొసైటీ గ్రూపు ‘ప్రహార్’ నిర్వహించిన అధ్యయనంలో విధాన రూపకర్తలను, నిరుద్యోగులను కలవరపెట్టే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.