ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ డీమానిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న దిగ్భ్రాంతికర చర్య ప్రజల ఆస్తులనుభారీగా దొంగిలించడంగా పేర్కొన్న ఫోర్బ్స్.. 1975-77 లో ఎమర్జన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమంతో (ఫోర్స్డ్-స్టెరిలైజేషన్ డ్రైవ్) పోల్చింది