immoral
-
స్వలింగ సంపర్కం నేరం కాదు: పోప్
వాటికన్ సిటీ: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఆ చట్టాలు పూర్తిగా అనైతికమైనవి. స్వలింగ సంపర్కం నేరం కాదు. దేవుడు తన పిల్లలందరినీ సమానంగా, బేషరతుగా ప్రేమిస్తాడు’’ అని అసోసియేటెడ్ ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను కొందరు క్యాథలిక్ బిషప్లు కూడా సమర్థిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా విజ్ఞప్తల్లా ఒక్కటే. స్వలింగ సంపర్కుల పట్ల కాస్త మృదువుగా వ్యవహరించాలి. వారిని కూడా చర్చిల్లోకి అనుమతించాలి. వారిని స్వాగతించి గౌరవించాలి తప్ప వివక్ష చూపి అవమానించరాదు’’ అని ఆయన సూచించారు. అయితే, స్వలింగ సంపర్కం పాపమేనని పోప్ పేర్కొనడం విశేషం. ‘‘ఇది ఒక దృక్కోణం. కాకపోతే ఈ విషయంలో సాంస్కృతిక నేపథ్యాలు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే ఇతరులపై జాలి, దయ చూపకపోవడమూ పాపమే. కాబట్టి నేరాన్ని, పాపాన్ని విడిగానే చూడటం అలవాటు చేసుకుందాం’’ అన్నారు. క్యాథలిక్ బోధనలు స్వలింగ సంపర్కాన్ని తప్పుడు చర్యగానే పేర్కొంటున్నా స్వలింగ సంపర్కులను కూడా ఇతరులతో సమానంగా గౌరవించాలని చెబుతాయి. క్యాథలిక్ చర్చి ప్రకారం స్వలింగ వివాహాలు నిషిద్ధం. దాదాపు 67 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. వీటిలోనూ 11 దేశాల్లో ఇందుకు మరణశిక్ష కూడా విధించే ఆస్కారముందని ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్న హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పేర్కొంది. అమెరికాలో కూడా 12కు పైగా రాష్ట్రాలు దీన్ని నేరంగానే పరిగణిస్తున్నాయి. ఇలాంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. -
డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు
-
డీమానిటైజేషన్: ఫోర్బ్స్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ డీమానిటైజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అనైతికమని, ప్రజల సొత్తును దోచుకోవడమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న దిగ్భ్రాంతికర చర్య ప్రజల ఆస్తులనుభారీగా దొంగిలించడంగా పేర్కొన్న ఫోర్బ్స్.. 1975-77 లో ఎమర్జన్సీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమంతో (ఫోర్స్డ్-స్టెరిలైజేషన్ డ్రైవ్) పోల్చింది. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారతదేశం ఆర్థికవ్యవస్థను, భవిష్య పెట్టుబడులను దెబ్బతీసిందని ఫోర్బ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీవ్ ఫోర్బ్స్ పేర్కొన్నారు.కరెన్సీ రద్దు చేయడం అంటే సామాన్యుడి గోప్యతపై దాడిచేయడమన్నారు. ప్రభుత్వం చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా కోట్లాదిమంది పేదల్ని మరింత భయాందోళల్లోకి నెట్టివేసిందనీ,ఇది అనైతికమని పేర్కొన్నారు. అంతేకాదు కరెన్సీ రద్దు చేసినంత మాత్రాన టెర్రరరిస్టులు తమ దుర్మార్గపు పనులను వదిలి పెట్టరని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా మార్కెట్లకు అనుమతి ఉంటేనే డిజిటైజేషన్ సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 85 శాతం చలామణీలో ఉన్న నోట్లను రద్దు చేసి, సామాన్య ప్రజానీకాన్ని అత్యంత ఇబ్బందుల్లోకి నెట్టివేసిందన్నారు. తాజా కఠినమైన నిర్ణయాలు, పన్నుల విధానంపై కూడా పత్రిక మండిపడింది. చట్టబద్దమైన వ్యాపారాన్ని సులువు చేసి వ్యాపార అవకాశాలను మరింత అందుబాటులోకి తేవాలన్నారు. మొత్తం పన్నుల విధానం సరళీకృతం చేయాలని ఆదాయ,వ్యాపార పన్నులను మరింత తగ్గించాలని మాగజీన్ సూచించింది. పన్నుల ఎగవేతకు పరిష్కారంగా ఎంత తక్కువ పన్ను రేటు ఉంటే అంతమంచిదని తెలిపింది. దేశీయ కరెన్సీ మరింత బలోపేతం చేయాలని కోరింది. -
గే సెక్స్ పై ఆర్ఎస్ఎస్ యూటర్న్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ యూటర్న్ తీసుకుంది. సజాతీయుల సంబంధాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. గే సెక్స్ ను నేరంగా పరిగణించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాట మార్చింది. గే సెక్స్ నేరం కాదని, అనైతికమని, దానికి శిక్ష కంటే మానసిక చికిత్స అవసరమని పేర్కొంది. 'స్వలింగ సంపర్కం నేరం కాదు. సమాజంలో అదో అనైతికమైన పని. స్వలింగ సంపర్కానికి పాల్పడినవారిని శిక్షించాల్సిన అవసరం లేదు. మానసిక సంబంధమైన సమస్యగా గుర్తించి, వారికి చికిత్స అందించడం అవసర'మని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హెసబాలె తన అభిప్రాయాన్ని శుక్రవారం ట్వీట్ చేశారు. స్వలింగ సంపర్క దృక్పథాన్ని నేరంగా చూడకూడదని, వారిలో మార్పు తేవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తూ అమలవుతున్న ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. -
పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం
హాలియా (నల్లగొండ): పార్టీ ఫిరాయింపు అప్రజాస్వామికమని, అనైతికమని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ పార్టీ గుర్తుపై గెలుపొంది మరో పార్టీలోకి వెళ్లడం సరైనది కాదన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో జరిగినా, ఎవరు ప్రోత్సహించినా అది సరైన విధానం కాద్దన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారికి ప్రజలే వెంటబడి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారం మండలం నుంచి మూడు రోజుల క్రితం టీఆర్ఎస్లోకి వెళ్లిన వారు స్థానిక ప్రజలు, నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోనికి వెళ్లిన వారు మళ్లీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన వారు పార్టీ మారాలనుకుంటే పార్టీకి, పదవికిరాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ ఇతర పార్టీలోనికి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుపోందాలని సూచించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద వరి, ఇతర పంటలను కాపాడాల్సిన బాధ్యత రె ండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సమావేశంలో ఆయన వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటిలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, కాకునూరి నారాయణ, రావుల శ్రీనివాస్ యాదవ్. యడవెల్లి సోమశేఖర్, మర్ల చంద్రారెడ్డి, పోశం శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.