వైబ్రెంట్ గుజరాత్ సదస్సు జరుగుతోంది.. అక్కడ అంతా దిగ్గజాలు కొలువుదీరారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 దేశాలు ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాయి. అలాంటి సదస్సులో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేని ఓ చిన్న పిల్లాడు కళ్లజోడు పెట్టుకుని, నీలి రంగు సూట్ వేసుకుని వచ్చాడు. మాటలతో అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశాడు.