మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట, 60 మంది మృతి | 60 feared killed, 100 injured in Madhya Pradesh temple stampede | Sakshi
Sakshi News home page

Oct 13 2013 4:31 PM | Updated on Mar 20 2024 3:44 PM

మధ్యప్రదేశ్లో ఓ దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 60కి చేరింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దతియా జిల్లా రతన్గఢ్ మాత దేవాలయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మృతుల సంఖ్యను ఐదుగానే భావించారు. కానీ, క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగింది. తప్పించుకునే క్రమంలో వందలాంది మంది భక్తులు సమీపంలోని సింధ్ నది బ్రిడ్జి దిశగా పరుగులు తీశారు. కొందరు నదిలో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement