కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు నాగప్రవీణ్ (14), నవీన్ (12) లు ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబ కలహాలు జరుగుతుండటంతో వెంకటరమణ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలకు తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు. వారు మత్తులోకి వెళ్లగానే కత్తితో ముగ్గురు పీకలు కోసి అనంతరం ఇంటి వద్ద ఉన్న చెట్టుకు అతడూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.