ఇంతకుముందున్న లెఫ్టినెంట్ గవర్నర్‌తో దాదాపు ప్రతిరోజూ కొట్లాటలకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త ఎల్‌జీ అనిల్ బైజల్‌తోనూ తలనొప్పి తప్పలేదు. ప్రభుత్వ ప్రకటనలలో కేజ్రీవాల్‌ను చూపించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రూ. 97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని బైజల్ ఆదేశించారు.