ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ నేతలు మాటమార్చగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి వంతపాడుతున్నారు. కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఇదివరకే స్వాగతించిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందని వ్యాఖ్యానించారు. శనివారం ఏపీ శాసనమండలిలో చర్చ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.