రెండో రోజు కొనసాగుతున్న ఆటోల బంద్... | Autos Off The Road Protesting GO 108 | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 5 2013 10:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

హైదరాబాద్లో ఆటోల బంద్‌ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చలానా మొత్తాన్ని వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 108ని ఉపసంహరించుకోవాలని నిన్న ఆటో సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని దాదాపు లక్షా 60 వేల వివిధ రకాల వాహనాలు రోడ్డెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆటోలకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులను నడపడంలో విఫలమైంది. సిటీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో రోజూ కూడా నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement