వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన రాజధాని ప్రాంత పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశా లతో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు గ్రామాల బాట పట్టారు. రెండే ళ్లుగా రాజధాని ప్రాంత రైతులకు కని పించ కుండా ముఖం చాటేస్తున్న మంత్రులు, టీడీపీ నాయకులు.. జగన్ పర్యటన నేపథ్యంలో రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది.