తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశిస్తున్న అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జయలలిత మరణించిన తర్వాత పక్కా వ్యూహంతో అన్నా డీఎంకేను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్న శశికళకు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పరిస్థితులు మారిపోయాయి.