పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు చేయి చేసుకుంటున్నంత పని చేశారు. నల్లజెండాలతో ఆయనపైకి దూసుకెళ్లారు. ఈ దృశ్యానికి కోల్‌కతా విమానాశ్రయం వేదికైంది. గురువారం కోల్‌కతాలో బ్యాంకర్ల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం జరుగుతుండగానే అక్కడ కొంతమంది సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. అయితే, ఈసారి నిరసన తెలిపిన వారు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.