black flags
-
కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్’ నినాదాలు
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు. గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది. बीजेपी सांसद गिरिराज सिंह को उनके संसदीय क्षेत्र में बीजेपी कार्यकर्ताओं ने काले झंडे दिखाए। pic.twitter.com/j7OmTGtg9U — Lutyens Media (@LutyensMediaIN) March 10, 2024 -
ఓవర్ టు.. ఢిల్లీ!
సాక్షి, హైదరాబాద్: యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో పక్షం రోజులుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘వరి పోరు’కు ఇక ఢిల్లీ వేదికకానుంది. గత నెల 21న సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొదలైన వరి పోరు కార్యాచరణ శుక్రవారం ఊరూరా నల్లజెండాల ఎగురవేతతో ముగిసింది. ఈ నేపథ్యంలో గత 4న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన తెలిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్రం స్పందించకపోవడంతో..: ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా గత నెలలో రాష్ట్ర మంత్రుల బృందం కోరినా.. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో వరి పోరుపై కార్యాచరణను టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ అధినేత పిలుపు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు.. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ గత నెలలో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించాయి. తిరిగి ఈ నెల 4 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం వరకు.. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఊరూరా నల్లజెండాల ఎగురవేత, మోదీ దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దేశ రాజధానిలో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 3నే ఢిల్లీ వెళ్లారు. 12వ తేదీ వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. 11న జరిగే నిరసన దీక్షలో ఆయన పాల్గొనే అంశంపై మాత్రం గోప్యత పాటిస్తున్నాయి. మంత్రులు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ దీక్షకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీక్షకు రావాల్సిందిగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, మున్సిపల్, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. సుమారు 1,500 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఢిల్లీ దీక్షకు హాజరవుతున్నట్లు అంచనా. వీరంతా ఆదివారం రాత్రికల్లా ఢిల్లీ చేరుకోనున్నారు. మంత్రి కేటీఆర్ మాత్రం 11వ తేదీ ఉదయం రాజధానికి వెళతారని తెలిసింది. మరోవైపు ముఖ్య నేతల అనుచరులు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానాలు.. రైలు బోగీలు పార్టీ నుంచి ఆహ్వానం అందిన వారి కోసం రెండు ప్రత్యేక విమానాలతో పాటు ప్రత్యేక రైలు బోగీలను బుక్ చేశారు. అయితే అధికారిక పనుల కారణంగా సుమారు అరడజను మంది మంత్రులు ఢిల్లీ దీక్షలో పాల్గొనబోవడం లేదని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లే నేతల వివరాలు, వెంట వరి ధాన్యం తెస్తున్నారా.. తదితర వివరాలు సేకరిస్తోంది. -
500 రోజులైనా వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. వేలాదిగా మోహరించిన పారా మిలటరీ బలగాలు.. ఆందోళనకారులపై ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్న లాఠీలు..పరిస్థితి చేయిదాటితే నిలువరించేందుకు వాటర్ కేనన్లు, బాష్పవాయు గోళాలు.. 100 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లోని ఏ ప్రాంతంలో చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన ప్రారంభించిన రైతులతో కేంద్రప్రభుత్వం 11 విడతల్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంతేగాక సుప్రీంకోర్టు జోక్యంతో ఏర్పాటైన కమిటీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు అంగీకరించలేదు. దీంతో వ్యవసాయ చట్టాల విషయంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇప్పుడు ఉత్తరాదిన మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత 100 రోజులుగా రైతుల ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు సరిహద్దులో రైతులు తమ ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. నవంబర్ 26న రైతులు తమ నిరసన ప్రారంభించిన రోజు ఏ విధంగానైతే వాతావరణం ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ట్రాక్టర్లు, ట్రాలీలు, లంగర్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు, తాత్కాలిక ఆసుపత్రులు, గుడారాలు 100 రోజులు అయినప్పటికీ అలానే ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆందోళన ప్రారంభించిన రైతుల సంకల్పం ఎక్కడా చెక్కుచెదరలేదు. గతేడాది నిరసన ప్రారంభమైనప్పుడు దేశ రాజధానిలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు ఇప్పుడు నిరసన వేదికకు 4–5 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ అనంతరం 14 మంది పంజాబ్ రైతుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. మూడు నెలల్లో తీవ్రమైన చలి కారణంగా రైతు ఉద్యమంలో 108 మంది రైతులు కన్నుమూశారని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన శనివారానికి (మార్చి 6వ తేదీ) 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత సజీవంగా ఉంచేందుకు ఢిల్లీ వెలుపల ఉన్న కుండ్లి–మనేసర్–పాల్వాల్ వెస్ట్రన్ ఫెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేను నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐదు గంటలపాటు అడ్డుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా గతంలోనే ప్రకటించింది. శనివారం రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించేందుకు ఇళ్ళు, కార్యాలయాలపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఎస్కేఎం కోరింది. ఈ చర్యతో ప్రభుత్వం మళ్ళీ తమతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. జనవరి 26న రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరిగాక రైతు ఉద్యమంలో మార్పు మొదలైంది. విధ్వంసానికి వ్యతిరేకంగా పలు సంఘాలు రైతు ఉద్యమం నుంచి దూరమవుతున్నట్లుగా ప్రకటించాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు విధ్వంసాన్ని తప్పుబట్టాయి. ఆ సమయంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ రంగంలోకి దిగారు. రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి 500 రోజులు పట్టినా ఆందోళనలను ఆపే ప్రసక్తిలేదని రైతు సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఎంఎస్పీ దిలావ్ అభియాన్‌కు శ్రీకారం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్ దివస్‌గా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త నిరసనలలో మహిళలు ఎక్కువగా పాల్గొంటారని రైతు సంఘాలు తెలిపాయి. మార్చి 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. ఈ రోజును కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాల పిలుపునకు ఎస్కేఎం మద్దతు ప్రకటించింది. వీటికితోడు దేశమంతటా కనీస మద్దతు ధరపై ప్రజల్లోనూ అవగాహనను పెంచేలా ఎంఎస్íపీ దిలావ్ అభియాన్ వంటి వినూత్న కార్యక్రమానికి ఎస్కేఎం శ్రీకారం చుట్టనుంది. మొదట ఈ విభిన్న కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు. -
నల్ల జెండాలను చూస్తే వారికి భయం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ ముఖ్యమంత్రులకు ఇప్పుడు నల్ల జెండాల భయం పట్టుకున్నట్లుంది. ఎక్కడైన వారికి నల్ల జెండాల నిరసన ఎదురయితే భరించలేక పోతున్నారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పోలీసులు కూడా ఒకప్పుడు ఎర్ర జెండాలను చూస్తే రెచ్చిపోయినట్లుగా ఇప్పుడు నల్ల జెండాలను చూస్తే రెచ్చి పోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటన సందర్భంగా గువాహటిలో శనివారం ఆయన కాన్వాయ్ ముందు నల్ల జెండాలను ప్రదర్శించినందుకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారంతా విద్యార్థులే. అస్సాం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా వారు నిరసన వ్యక్తం చేశారు. వారు అంతకుముందు చొక్కాలు చింపుకొని అర్ధనగ్నంగా కూడా ప్రదర్శనలు జరిపారు. దాంతో స్థానిక పోలీసు అధికారులు ఓ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిరసన ప్రదర్శనల్లో విపరీత పోకడలు వద్దని, మౌనంగా నల్ల జెండాలతో ప్రదర్శన జరిపేందుకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. రాజస్థాన్‌లో, 2018, మార్చి నెలలో నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగానే ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’కు చెందిన కాంట్రాక్టు కార్మికులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి లక్నో యూనివర్శిటీ సందర్శన సందర్భంగా గత జూన్ నెలలో 23 ఏళ్ల పూజా శుక్లా, మరో పది మంది నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయగా, వారిని 26 రోజులపాటు జైల్లో పెట్టారు. ఆ మరుసటి నెల జూలైలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ ముందు నెహా యాదవ్, మరో ముగ్గురు నల్ల జెండాలను ప్రదర్శించగా వారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన శుక్లా, యాదవ్‌లను జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైల్లో చితకబాదారట. ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని బెదిరించారట. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన అందరిపైనా చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని, అల్లర్లకు పాల్పడ్డారని, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డం పడ్డారని, ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారంటూ కేసులు దాఖలు చేయగా, రాజస్థాన్‌లోని ఆరోగ్య కార్యకర్తలపై ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చారని అభియోగాలు మోపారు. ఇలా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం యూరప్ దేశాల్లో అనార్కిస్టు పార్టీల నుంచి వచ్చింది. యూరప్ వీధుల్లో మొదటిసారి 1982లో నల్ల జెండాల ప్రదర్శన జరిగినట్లు చరిత్రలో నమోదయింది. అప్పట్లో అనార్కిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేయడానికి నల్ల జెండాలనే కాకుండా ఎర్ర జెండాలను కూడా ప్రదర్శించేవారు. సోవియట్ యూనియన్‌లో అక్టోబర్ రెవెల్యూషన్ తర్వాత ఎర్ర జెండా కమ్యూనిస్టుల అధికారిక జెండాగా మారడంతో అనార్కిస్టులు ఎర్రజెండాను వదిలేశారు. అలా మొదలైన నల్లజెండాల ప్రస్థానం ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల నిరసనకు చిహ్నంగా మారింది. -
గూడేల్లో ఎగిరిన నల్లజెండాలు
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామా ల్లో తుడుందెబ్బ నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ‘మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో నినాదాలు మారుమోగాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నల్ల జెండాలు ఎగురవేస్తూ ఆదివాసీలు నిరసనలు తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గూడేలతోపాటు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అరెస్టుచేశారు. మా భూమి మాకివ్వండి నేరడిగొండ మండలంలోని వాగ్ధారిలో తమ 105 ఎకరాల భూమిని లంబాడాల పేరుపై పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ముందుగా వాగ్ధారి గ్రామంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచి ధస్నాపూర్ వరకు 500 మంది ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో వచ్చేంత వరకు అక్కడే బైఠాయించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్డీవో సూర్యనారాయణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలకు ఆదివాసీలు వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయుల అడ్డగింత ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లంబాడా మహిళా ఉపాధ్యాయులను బహిష్కరించాలని ఆదివాసీ విద్యార్థులు అడ్డుకున్నారు. తరగతులకు రానివ్వకుండా ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ మండలంలోని కుమురంభీం చౌరస్తాలో, అంకోలి గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల జెండాను ఎగురవేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నేతలు నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రం, బీంపూర్ మండల కేంద్రం, బోథ్ మండంలోని పట్నపూర్‌లో నల్ల జెండాలు ఎగురవేశారు. ఉట్నూర్ మండలంలోని చిన్నసుద్దగూడ, పెద్దసుద్దగూడ, పర్కుగూడ, కల్లూరిగూడల్లో.. నార్నూర్ మండలంలోని మంకాపూర్, నాగల్కొండ, బలాన్పూర్, శేకుగూడతోపాటు దాదాపు జిల్లావ్యాప్తంగా అన్ని ఆదివాసీ గూడెల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. -
జాతీయ జెండాకు బదులు నల్లజెండా..
మల్కన్‌గిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరనీయకుండా మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి పప్పులూర్ ప్రాథమిక పాఠశాలలో మావోయిస్టులు నల్లజెండాను ఎగురవేశారు. జెండా ఎగుర వేసిన ప్రాంతంలో మావోయిస్టులు పోస్టర్లు అతికించారు. ఈ నల్ల జెండాను ఎవరైనా తీసివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోస్టర్లలో హెచ్చరించారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి మేలూ చేయడం లేదు. గిరిజనుల కోసమే అభివృద్ధి పథకాలు అంటూ నే వాటిని గిరిజనులకు అందనీయడం లేదు. ఏ ఒక్క రాజకీయ నేత కూడా గిరిజన ప్రాంతా లకు వస్తున్న దాఖలాలు లేవు. అధికారుల వల్ల కూడా గిరిజనులకు ఒరిగేదేమీ లేదని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు. -
సీఎం యోగి సభలో నల్ల జెండాలు
-
ఉర్జిత్ షాక్.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు
-
ఉర్జిత్ షాక్.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు చేయి చేసుకుంటున్నంత పని చేశారు. నల్లజెండాలతో ఆయనపైకి దూసుకెళ్లారు. ఈ దృశ్యానికి కోల్‌కతా విమానాశ్రయం వేదికైంది. గురువారం కోల్‌కతాలో బ్యాంకర్ల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం జరుగుతుండగానే అక్కడ కొంతమంది సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. అయితే, ఈసారి నిరసన తెలిపిన వారు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సమావేశం ముగిసిన అనంతరం ఉర్జిత్ తన కారులో విమానాశ్రయం వద్దకు రాగా, పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో ఆయనపైకి దూసుకొచ్చారు. ఆయన కారులో నుంచి దిగుతుండగానే ఆయనపైకి ఓ కార్యకర్త గట్టిగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లడం. అక్కడ ఆయనకు రక్షణ డొల్ల స్పష్టంగా కనిపించింది. ఒక దేశ ఆర్బీఐ గవర్నర్‌కు ఉండాల్సిన భద్రత కూడా అక్కడ కరువైంది. దీంతో దాదాపు తోపులాట పరిస్థితి ఏర్పడింది. ఆయన వద్ద ఉన్న కొద్దిపాటి సిబ్బందికి దూసుకొస్తున్న కార్యకర్తలను అడ్డుకునేందుకు చెమటలు పట్టాయి. మరోపక్క, ఈ దృశ్యాలను మీడియా సైతం వీడియోలు, ఫొటోలు తీసింది. ఉర్జిత్ పటేల్ డౌన్ డౌన్ అంటూ నిరసనకారులు ఆయనపైకి దూసుకెళ్లడంతో భద్రతాధికారులు మాత్రం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. -
నేరస్తుడికి మోదీ ప్రచారం తగదు: శివసేన
సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లాలో గురువారం జరుగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచారసభలో నల్లజెండాలు చూపించేందుకు శివసేన సిద్ధమవుతోంది. అహ్మద్‌నగర్ జిల్లాలోని రాహురీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న శివాజీ కార్డిలే గతంలో ఒక కేసు విషయంలో ఏడాది కఠిన కారాగార శిక్ష, మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించారు. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన నిలుచున్న నియోజకవర్గంలో జరుగనున్న పార్టీ ప్రచారసభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. దీనిపై శివసేన తీవ్రంగా మండిపడింది. ఈ విషయమై తమ నిరసనను వ్యక్తం చేస్తూ స్థానిక శివసేన యువనాయకుడు కేశవ్ అలియాస్ రాజేంద్ర షిండే ప్రధాని కార్యాలయానికి ఒక లేఖను కూడా పంపించారు. జైలు శిక్షపడిన వ్యక్తి కోసం దేశ ప్రధాని ప్రచారం చేయడం సబబుకాదని పేర్కొంటూ రాహురి ప్రచారసభలో పాల్గొనవద్దని కోరారు. లేదంటే తాము ప్రధాని నరేంద్ర మోదీకి నల్లజెండాలు చూపించి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. -
కేంద్ర మంత్రికి నల్లజెండాలతో జేఎంఎం నిరసన
రాంచీ: ప్రధాని సమక్షంలో తమ నేతకు జరిగిన అవమానానికి నిరసనగా జేఎంఎం కార్యకర్తలు అన్నంత పని చేశారు. శనివారం జార్ఖండ్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రెండు సార్లు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులకు నిరసన తెలుపుతూనే ఉంటామని జేఎంఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి తోమర్ ఎదుట నిరసన తెలిపారు. తన కాన్వాయ్‌లో వెళుతున్న తోమర్‌కు జేఎంఎం కార్యకర్తలు నల్లజెండాలు చూపారు. తర్వాత జంషెడ్‌పూర్‌లోనూ ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదిక వెలుపల కూడా ఇదే పని చేశారు. కాగా, రాంచీ విమానాశ్రయం వద్ద బీజేపీ, జేఎంఎం కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నిజానికి తోమర్ ఎదుట నిరసన తెలిపేందుకు జేఎంఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా రావడంతో అప్పటికే చాలా మంది కార్యకర్తలు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే ప్రమాదం తప్పిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
సోనియాకు నల్లజెండాలు చూపించగలరా?
వారణాసి: కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన శత్రువు తమ పార్టీయేనని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీకి ఎందుకు నల్లజెండాలు చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నల్లజెండాలు ఎందుకు చూపించుకోవని ఆయన నిలదీశారు. వారణాసిలో నిర్వహించిన రోడ్ షో ఆయన ప్రసంగించారు. సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని సవాల్ చేశారు. బీజేపీ నాయకులకు నల్లజెండాలు చూపించే తెగువ కాంగ్రెస్‌కు ఉందా అని ప్రశ్నించారు. గుజరాత్ వెళ్లినప్పుడు నరేంద్ర మోడీ మనుషులు తనకు నల్లజెండాలతో స్వాగతం పలికారని చెప్పారు. వారణాసిలోనూ అదే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లజెండాలు, ఇంకు చల్లడం వారణాసి సంప్రదాయం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. మోడీకి ఓటు వేస్తే చిన్న దుకాణాలు మూతపడతాయని చెప్పారు. -
కేజ్రీవాల్‌కు నల్లజెండాలతో నిరసన
ఫరీదాబాద్: హర్యానా పర్యటనలో భాగంగా ఫరీదాబాద్‌లో శుక్రవారం రోడ్‌షో నిర్వహిం చిన అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురయింది. స్థానికులు కొందరు ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఫరీదాబాద్ లోక్‌సభ అభ్యర్థి పురుషోత్తమ్ డగర్తోపాటు కేజ్రీవాల్ సెక్టార్ 37 మార్కెట్ నుంచి రోడ్డు షో మొదలుపెట్టారు. ఏ పార్టీకి చెందబోమని ప్రకటించుకున్న కొందరు స్థానికులు నల్లజెండాలు చూపుతూ కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థులకు నల్లజెండాలు చూపడం సహజమని, దేశాన్ని సమర్థంగా పాలించగల శక్తి కేజ్రీవాల్ ఒక్కరికే ఉం దని ఆప్ స్థానిక నాయకుడు ఒకరు అన్నారు. కేజ్రీవాల్ రెండు రోజులపాటు గుర్గావ్, ఫరీదాబాద్‌లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఇవి చందావలి, దయాల్పూర్, చేన్సా, మోహ్నా,అల్వాల్పూర్ మీదుగా సాగి నుహ్ వద్ద శనివారం రాత్రి ముగుశాయి. గుర్గావ్లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్‌షోలు కొనసాగుతాయి. -
రోడ్‌షోలో కేజ్రీవాల్‌కు నల్లజెండాలు
సొంత రాష్ట్రం హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఫరీదాబాద్‌లో ఆయన రోడ్‌షో ప్రారంభించినప్పుడు కొంతమంది స్థానికులు ఆయనకు నల్లజెండాలు చూపించారు. ఫరీదాబాద్ లోక్‌సభా స్థానానికి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పురుషోత్తమ్ డాగర్‌తో కలిసి ఆయన రోడ్ షో ప్రారంభించారు. అయితే.. ఏ పార్టీతోనూ సంబంధం లేని కొంతమంది స్థానికులు ఆయనకు నల్లజెండాలు చూపించి, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, కేజ్రీవాల్‌కు నల్లజెండాలు చూపించడం ఇదేమీ కొత్తకాదని, ఇంతకుముందు విపక్షాలు కూడా కొన్నిసార్లు ఆయనకు నల్లజెండాలు చూపించాయని, కేజ్రీవాల్ మాత్రమే ఈ దేశాన్ని సరిగా పాలించగలరని ఆమ్ ఆద్మీ మద్దతుదారు ఒకరు అన్నారు. -
హర్యానాలో కేజ్రీవాల్ రోడ్ షో
-
వేడుకలు వెలవెల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలు బోసిపోయాయి. తెలంగాణవాదుల నిరసనల భయంతో అధికారిక కార్యక్రమం కొందరు అధికారులకే పరిమితం అయ్యింది. రాష్ర్ట అవతరణ దినాన్ని విద్రోహదినంగా పాటిస్తామన్న టీఆర్ఎస్, టీజేఏసీ ప్రకటనల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు మధ్య కార్యక్రమాన్ని మమ అనిపించారు. వేడుకలకు దూరమని ప్రకటించిన మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు వస్తున్న వారిని నిలువెల్లా తనిఖీ చేశారు. నల్ల జెండాలు ఎగరేస్తారేమోనన్న అనుమానంతో జేబురుమాళ్లను కూడా పరిశీలించారు. దీంతో సామాన్యజనం పరేడ్ గ్రౌండ్ వైపు కన్నెత్తికూడా చూడలేదు. కొంతమంది సామాన్యులు వచ్చినా భద్రత పేరుతో లోపలకు పంపలేదు. ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కిందిస్థాయి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేడుకలను బహిష్కరించడంతో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అధికారుల గ్యాలరీలో ఖాళీ కుర్చీలు కనిపించా యి. కార్యక్రమం 25 నిమిషాల్లో ముగిసింది. ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ సరిగ్గా ఉదయం 8.46 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. వచ్చీ రాగానే సమయానికంటే 13 నిమిషాల ముందే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత తెలుగుతల్లికి పూల మాలవేశారు. మా తెలుగుతల్లి గీతాలపనను సౌండ్ సిస్టమ్ ద్వారా వినిపించారు. పతాకావిష్కరణ, ప్రసంగం, గౌరవవందన స్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. పట్టణ ప్రముఖులు, ఉద్యోగులు, పార్టీల నాయకులు, సమరయోధులు, ఇతరులు హాజరుకాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. విద్యార్థుల ఆటపాటలు, కళాకారుల నృత్యాలు, ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలు అందివ్వలేదు. పోలీసుల హడావుడి మాత్రం కనిపించింది.