
ఏప్పులూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎగురుతున్న నల్లజెండా
మల్కన్‌గిరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరనీయకుండా మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి పప్పులూర్ ప్రాథమిక పాఠశాలలో మావోయిస్టులు నల్లజెండాను ఎగురవేశారు. జెండా ఎగుర వేసిన ప్రాంతంలో మావోయిస్టులు పోస్టర్లు అతికించారు.
ఈ నల్ల జెండాను ఎవరైనా తీసివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోస్టర్లలో హెచ్చరించారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి మేలూ చేయడం లేదు. గిరిజనుల కోసమే అభివృద్ధి పథకాలు అంటూ నే వాటిని గిరిజనులకు అందనీయడం లేదు. ఏ ఒక్క రాజకీయ నేత కూడా గిరిజన ప్రాంతా లకు వస్తున్న దాఖలాలు లేవు. అధికారుల వల్ల కూడా గిరిజనులకు ఒరిగేదేమీ లేదని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.