ఉర్జిత్‌ షాక్‌.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు | Congress workers show black flags to RBI Governor Urjit Patel | Sakshi
Sakshi News home page

ఉర్జిత్‌ షాక్‌.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు

Published Thu, Dec 15 2016 8:29 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఉర్జిత్‌ షాక్‌.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు - Sakshi

ఉర్జిత్‌ షాక్‌.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దాదాపు చేయి చేసుకుంటున్నంత పని చేశారు. నల్లజెండాలతో ఆయనపైకి దూసుకెళ్లారు. ఈ దృశ్యానికి కోల్‌కతా విమానాశ్రయం వేదికైంది. గురువారం కోల్‌కతాలో బ్యాంకర్ల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం జరుగుతుండగానే అక్కడ కొంతమంది సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. అయితే, ఈసారి నిరసన తెలిపిన వారు మాత్రం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.

సమావేశం ముగిసిన అనంతరం ఉర్జిత్‌ తన కారులో విమానాశ్రయం వద్దకు రాగా, పెద్ద మొత్తంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నల్లజెండాలతో ఆయనపైకి దూసుకొచ్చారు. ఆయన కారులో నుంచి దిగుతుండగానే ఆయనపైకి ఓ కార్యకర్త గట్టిగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లడం. అక్కడ ఆయనకు రక్షణ డొల్ల స్పష్టంగా కనిపించింది. ఒక దేశ ఆర్బీఐ గవర్నర్‌కు ఉండాల్సిన భద్రత కూడా అక్కడ కరువైంది. దీంతో దాదాపు తోపులాట పరిస్థితి ఏర్పడింది. ఆయన వద్ద ఉన్న కొద్దిపాటి సిబ్బందికి దూసుకొస్తున్న కార్యకర్తలను అడ్డుకునేందుకు చెమటలు పట్టాయి. మరోపక్క, ఈ దృశ్యాలను మీడియా సైతం వీడియోలు, ఫొటోలు తీసింది. ఉర్జిత్‌ పటేల్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నిరసనకారులు ఆయనపైకి దూసుకెళ్లడంతో భద్రతాధికారులు మాత్రం ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement