సోనియాకు నల్లజెండాలు చూపించగలరా? | Has BJP ever shown black flags to Sonia Gandhi, Rahul Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాకు నల్లజెండాలు చూపించగలరా?

Published Tue, Mar 25 2014 6:06 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

సోనియాకు నల్లజెండాలు చూపించగలరా?

సోనియాకు నల్లజెండాలు చూపించగలరా?

వారణాసి: కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన శత్రువు తమ పార్టీయేనని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీకి ఎందుకు నల్లజెండాలు చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నల్లజెండాలు ఎందుకు చూపించుకోవని ఆయన నిలదీశారు. వారణాసిలో నిర్వహించిన రోడ్ షో ఆయన ప్రసంగించారు.

సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని సవాల్ చేశారు. బీజేపీ నాయకులకు నల్లజెండాలు చూపించే తెగువ కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు. గుజరాత్ వెళ్లినప్పుడు నరేంద్ర మోడీ మనుషులు తనకు నల్లజెండాలతో స్వాగతం పలికారని చెప్పారు. వారణాసిలోనూ అదే పునరావృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లజెండాలు, ఇంకు చల్లడం వారణాసి సంప్రదాయం కాదన్నారు.  కాంగ్రెస్, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. మోడీకి ఓటు వేస్తే చిన్న దుకాణాలు మూతపడతాయని చెప్పారు.         

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement