కాశీ ఓటర్లు వాస్తవానికే పట్టం కడతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో ఆశాభావం వ్యక్తం చేశారు.
వారణాసి: కాశీ ఓటర్లు వాస్తవానికే పట్టం కడతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్లో ఆశాభావం వ్యక్తం చేశారు. వారణాసిలో నరేంద్ర మోడీపై కేజ్రీవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.
తమ విజయం ఖాయమని పలువురు నాయకులు ట్విటర్లో కామెంట్ప్ పోస్ట్ చేశారు. తాను కచ్చితంగా మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తమ పార్టీ 15 నుంచి 18 సీట్లు గెల్చుకుంటుందని బీజేపీ నేత సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని తాము నిరూపించబోతున్నామని కాంగ్రెస్ నేతలు మీమ్ అఫ్జల్, అజయ్ మాకెన్ పేర్కొన్నారు.