మోడీతో అమీతుమీకి వారణాసికి కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ను ఎదుర్కోనేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం రైలులో వారణాసి బయలుదేరారు. వందలాది మంది కార్యకర్తలు వీడ్కోలు చెప్పగా శివగంగ ఎక్స్ ప్రెస్ లో తన తల్లితండ్రులు, కొందరు ముఖ్య నేతలతో వారణాసికి ప్రయాణమైన కేజ్రీవాల్ మంగళవారం ఉదయం వారణాసి చేరుకోనున్నారు.
రైలు బోగిలో కేజ్రీవాల్ ఉన్నారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున్న ప్రయాణికులు ఆయన కలుసుకోవడానికి పోటిపడటంతో కొంత తోపులాట జరిదింది. పదో విడుత లోకసభ ఎన్నికలు జరిగే మే 12 తేది వరకు వారణాసిలోనే కేజ్రీవాల్ మకాం చేస్తారు. ఇప్పటికే సీనియర్ నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలు వారణాసి ప్రచారం చేస్తున్నారు