సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పే: కేజ్రీవాల్ | Admitting Delhi 'mistake', arvind Kejriwal has dialogue with voters | Sakshi
Sakshi News home page

సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పే: కేజ్రీవాల్

Published Thu, Apr 17 2014 2:12 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పే: కేజ్రీవాల్ - Sakshi

సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పే: కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేముందు తాను ప్రజలను సంప్రదించకపోవడం తప్పేనని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఓడించాలని వారణాసి ప్రజలకు పిలుపునిచ్చారు. వారణాసిలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన ఓటర్లతో రెండు గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు.

తనకు కేజ్రీవాల్ గురించి ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయని, ఆయన సామాన్యుడిలాగే ఉన్నాడని ఐదేళ్ల కోసారి వచ్చి పెద్దపెద్ద హామీలిచ్చే రాజకీయ నాయకుడిలా ఏమాత్రం లేరని ఘరహు రామ్ అనే రిక్షా కార్మికుడు తెలిపాడు. మే 10వ తేదీ వరకు తన ప్రచారం అంతటా తానీ 'జనసంవాదాలు' నిర్వహిస్తూనే ఉంటానని కేజ్రావాల్ చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేయడంలో తాను తప్పు చేసినట్లు ప్రజలందరిముందు బహిరంగంగా అంగీకరించారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏది అధికారంలోకి వచ్చినా విద్యుత్తు, ఎరువులు, నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోతాయని ప్రజలతో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement